14 April, 2026 | 5:21 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

రక్షణ కోరుతున్న -వ్యవసాయం

30-10-2025 12:00 AM

నీటి వనరులు మెండుగా ఉన్న పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలే ప్రధాన లాభదారులుగా మారాయి. వర్షాధారిత ప్రాంతాల్లో రైతులు ముందుకు రాలేకపోయారు. రెండు ధాన్యాలపైనే దృష్టి సారించడంతో చిరుధాన్యాల దిగుబడి తగ్గూతూ వస్తున్నది. దేశంలో ఆహార భద్రత ఉన్నప్పటికీ పోషకాహార లోపం మాత్రం తగ్గడం లేదు. 

భారత వ్యవసాయం ఒకప్పుడు ఆకలితో పోరాడిన ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. గోధుమ, వరి పంటల విజయాలు స్వయంపూర్తి దిశగా దేశాన్ని నడిపించాయి. కానీ నేడు పంట పొలాల్లో కొత్త ఆందోళనలు పెరుగుతూ వస్తున్నాయి. భూమి అలసిపోయింది, జల వనరులు తగ్గాయి, రైతు ఆదాయం నిస్సహాయంగా మారిపోయిందనంలో అతిశ యోక్తి లేదు. పోషకాహార లోపాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

పంటల ఉత్పత్తి పెరిగినా రైతు చేతికి అందే లాభం మాత్రం నేలలో కలిసిపోతోంది. రేపటి భారతదేశాన్ని కాపాడాలంటే మన వ్యవసాయ సాగు ఆలోచనలు మారాలి. భారతదేశం లో 1960 దశకంలో ప్రారంభమైన ‘హరిత విప్లవం’ దేశాన్ని ధాన్య దిగుమతులపై ఆధారపడిన స్థితి నుంచి ఆహార భద్రత కలిగిన దేశంగా తీర్చిదిద్దింది.

అధిక దిగుబడి విత్తనాలు, సాగునీటి విస్తరణ, రసా యన ఎరువులు, పంట సంరక్షణ, మందు ల వినియోగం పెరగడంతో గోధుమలు, వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగి కోట్లాది జనాభా ఆకలికి చెక్ పెట్టాయనడంలో సందేహం లేదు. ఈ విప్లవం దేశానికి బతుకు భరోసా ఇచ్చిన గొప్ప ఘట్టం. 

తగ్గుతున్న పౌష్టికత

కానీ ఈ పురోగతి దేశమంతటా ఒకేలా విస్తరించలేదు. నీటి వనరులు మెండుగా ఉన్న పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలే ప్రధాన లాభదారులుగా మారాయి. వర్షాధారిత ప్రాంతాల్లో రైతు లు ముందుకు రాలేకపోయారు. రెండు ధాన్యాలపైనే దృష్టి నిలవడంతో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, వాటి దిగుబడి తగ్గూతూ వస్తున్నది. దేశంలో ఆహార భద్రత ఉన్నప్పటికీ పోషకాహార లోపం మాత్రం తగ్గడం లేదు.

ఐదేళ్లలోపు చిన్నారుల్లో పొట్టితనం, కృశత సమస్యలు దేశానికి ఇంకా భారంగానే కనిపిస్తున్నాయి. ధాన్యం పెరిగినా అందులో పౌష్టికత అనేది తగ్గడంతో దేశానికి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ప్రపంచం మొత్తం భూమిలో భారతదేశ విస్తీర్ణం 2.3% మా త్రమే. ప్రస్తుత ప్రపంచ పంట విస్తీర్ణంలో 11 శాతం భూమి భారతదేశంలో పంటభూమిగా ఉంది. పశువుల పెంపకంలో భారతదేశం ప్రపంచంలో  30 శాతానికి పైగా వాటా కలిగి ఉంది.

అభివద్ధి చెందిన దేశాలు వస్తు ఉత్పత్తిలో అదనపు విలువను తోడు చేయడంలో కూడా 65% వాటా ఉన్నా, వ్యవసాయంలో 35 శాతం అదనపు విలువను మాత్రమే తోడు చేయగలుగుతున్నాయి. 1992లో భారతదేశ వ్యవసాయ సంబంధ రంగాల్లో తోడు చేసిన అదనపు విలువ 7.4% ఉండగా 2018 నాటికి 12.8 శాతానికి పెరిగిం ది. అదే కాలంలో అభివద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల వాటా 36.4% నుంచి 14.3%కి తగ్గింది.

వీటన్నిటికీ భిన్నంగా చైనా వ్యవసాయంలో అదనపు విలువను తోడు చేయడంలో 9.4% నుండి 30.7% కి చేరి మొదటి స్థానాన్ని సాధించింది. ఈ కాలంలో భారతదేశ ఎగుమతులు, దిగుమతుల్లో పెద్దగా పెరుగుదల లేదు. ప్రపంచీకరణ క్రమంలో దేశ వ్యవసాయం నూతన వరవడితో అభివద్ధి కాలేదని తెలుస్తున్నది.

పర్యావరణ సమస్యలు

పర్యావరణం కూడా వ్యవసాయంపై ఎప్పటికప్పుడూ తీవ్రమైన నష్టాన్నే చూపిస్తుంది. రసాయనాల అధిక వినియోగం నేల ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. భూగర్భజలాలు రోజురోజకు దిగజారుతున్నాయి. ఒకే పంట సాగుతో పంటల వైవిధ్యం తగ్గిం ది. తెగుళ్లు వచ్చినప్పుడు రైతులు భారీ నష్టాలను భరించాల్సి వస్తోంది. ఖర్చులు పెరిగి లాభం తగ్గిపోవడంతో రైతు కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోతున్నాయి.

ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ‘హరిత విప్లవమే’. హరిత విప్లవం కింద పర్యావరణాన్ని కాపాడుతూ రైతు కుటుంబానికి భరోసా ఇచ్చే సాగు విధానం. దేశం ఈ దిశగా అడుగులు వేస్తోంది. సహజ పద్ధతుల్లో సాగు, సూక్ష్మ, నీటిపారుదల, పంటల వైవిధ్యీకరణ, మట్టికి ఆరోగ్యపు పట్టికలు వంటి కార్యక్రమాలు భవిష్యత్తు మార్గాన్ని చూపిస్తున్నాయి. రైతు ఖర్చు తగ్గి లాభం పెరిగే సహజ సాగు పునరావిష్కరణకు మార్గం చూపుతోంది.

చిరు ధాన్యాలు మళ్లీ ప్రాముఖ్యత పొందాలి. తక్కువ నీరు అవసరమైన చిరు ధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండలను తట్టుకునే ఈ పంటలు గ్రామీణ కుటుంబాలకు ఆరోగ్య భరోసా ఇవ్వగల వు. ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన పథకాల్లో చిరుధాన్యాలు చేరిస్తే దేశంలో పౌష్టిక లోపాలు గణనీయంగా తగ్గుతాయి. రైతులకు కూడా మంచి ఆదాయ మార్గం ఉంటుంది.

సాగుభూమి తగ్గుదల

ఇక సాగుభూమి పరిమాణం తగ్గుతూనే ఉంది. వాతావరణ మార్పుల ప్రభా వం పెరుగుతోంది. ఈ సందర్భంలో సం ప్రదాయ జ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండు చేతులు కలపాలి. పంటను రక్షించడానికి శాస్త్రం, రైతును రక్షించడానికి విధానం.. ఈ రెండు సమన్వయం తప్పనిసరి. గ్రామీ ణ యువత వ్యవసాయం వైపు ఆకర్షితులవడం కోసం ఆదాయ భద్రత కలిగిన అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరముంది.

హరిత విప్లవం మన కు ఆకలి నుంచి విముక్తి ఇచ్చింది. రైతు కుటుంబానికి గౌరవప్రద జీవితం ఇవ్వగల శాశ్వత హరిత విప్లవం అవసరమనేది మరోసారి నొక్కి చెప్పాల్సిన అవసరముం ది. ప్రకృతిని కాపాడుతూ సాగు కొనసాగితేనే రాబోయే తరాలు సురక్షితంగా జీవిం చగలవు. దేశం ఎదుగుదల రైతు బలంపై ఆధారపడి ఉంటుంది. రైతుని బలపరిచే ప్రతి అడుగు భారత భవిష్యత్తుని బలపరుస్తుంది. 

శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, విధాన నిర్ణేతలు.. ఒకే లక్ష్యంతో ముందుకు రావాలి.  రైతు అభ్యున్నతి, పంటల వైవి ధ్యం, పర్యావరణ రక్షణ కోసం పాటుపడాలి.  హరిత విప్లవం చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఇక శాశ్వత హరిత విప్లవం మన భవిష్యత్తును కాపాడాలి. భారత వ్యవసాయాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపే సామర్థ్యం మనకు ఉంది. అందుకు ధైర్యమైన అడుగులు అవసరం.

ఈ దిశగా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, పరిశ్రమ- ఒకే లక్ష్యంతో ముందుకు సాగా లి. పట్టుదల, సరైన పెట్టుబడులు, సమయానుకూల విధానాలు ఉంటే భారత వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.  ఇది రైతు జీవన పరిరక్షణ మాత్రమే కాదు. భారతదేశ అభివృద్ధి దిశలో అత్యంత కీలకమైన అడుగు అవుతుంది.