calender_icon.png 19 February, 2026 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్యవైశ్య కార్పొరేషన్ లోగో ఆవిష్కరణ

19-02-2026 02:41:41 AM

అభినందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అధికారిక లోగోను బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించా రు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ బొగ్గారపు దయానంద్, బెల్దే శ్రీధర్, ఆకు ల రమాకాంత్, సరాపు సంతోష్, బచ్చు చైతన్య, పార్సి ప్రకాష్, దారం సతీష్, నల్మాస్ దేవేందర్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మార్చి నెలలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన శ్రీ వాసవీ మహా శక్తి మహోత్సవం..సామూహి క పారాయణ కార్యక్రమం గురించి కల్వ సు జాత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు. సుమారు 45 వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రమం గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించబోతోందని వివరించారు. దానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.