calender_icon.png 19 February, 2026 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల కోసం పుట్టిన పార్టీ సీపీఐ

19-02-2026 02:41:10 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ముషీరాబాద్, ఫిబ్రవరి18 (విజయక్రాంతి): పేద గిరిజన ఆటో డ్రైవర్, ఏఐటీ యూసీ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూ నియన్ నేత మూడ్ గణేష్ ను కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా సిపిఐ ఎంపిక చేయడం అభినందనీయమని ఏఐటీయూసీ తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం అన్నారు. ఆటో డ్రైవర్ మూడ్ గణేష్ ను కొత్తగూడెం మేయర్ గా ఎంపిక చేసినందుకు హైదరాబాద్ హిమాయత్ నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్డూమ్ భవన్ లో బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు ను కలసి బి. వెంకటేశం, ఇతర నేతలు శాలువా, ఫూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆటో డ్రైవర్ మూడ్ గణేష్, బి. వెంకటేశం, యూనియన్ నేతలు ఎస్. అశోక్, సిహెచ్. జంగయ ్య, ఎం. శ్రీనివాస్, ఎం. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.