అధికారుల సాక్షిగా..
24-08-2024 02:21 AM
చుట్టు ప్రభుత్వ ఆఫీసులు.. మధ్యలో చెత్తాచెదారం
భధ్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 23(విజయక్రాంతి): చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయితీ పరిధిలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. దీంతో సబ్ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లే దారిలో దుర్గంధం వెదజల్లుతోంది.
ఇక్కడే జడ్జిల నివాసాలు ఆర్టీఓ ఆఫీసు ఉన్నాయి. రోడ్డుపక్కనే చెత్తాచెదారం వేయడంతో కుక్కలు, పందుల స్వైర విహారం చేస్తునన్నాయి. జడ్జిలు, కోర్టు అధికారులు ఉండే నివాసం గోడ పక్కనే చెత్త పేరుకు పోయిన దృశ్యాన్ని విజయక్రాంత్రి క్లిక్ మన్పించింది.






