పాఠశాలకు వెళ్లే దారేది?
24-08-2024 02:16 AM
మహబూబ్‌నగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి దాదాపు అరకిలోమీటరు దూరంలో ఉన్న మోడల్ స్కూల్‌కు వెళ్లే దారి గుంతలమయంగా మారింది. రోడ్డుపై బురద, మురికినీరు నిలిచిపోయింది. దీంతో స్కూల్‌కు వెళ్లడానికి విద్యార్థులు ఆ బురదలోనే రాళ్లు వేసి వాటి పైనుంచి వెళుతున్నారు. స్కూల్‌లో 26 మంది ఉపాధ్యాయులు, 7 మంది లెక్చరర్స్, 800 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రతిరోజూ ఇబ్బంది పడుతున్నారు.






