సూర్య 45లో హీరోయిన్‌గా..
నాలుగు పదుల వయసులోనూ వన్నె తరగని అందం, చెక్కు చెదరని ఫిజిక్‌తో కుర్ర హీరోయిన్లకు త్రిష సవాల్ విసురుతున్నారు. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదిస్తూనే ఉన్నారు. హీరో సూర్య మెగా ఎంటర్‌టైనర్ ‘సూర్య 45’ ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రాజెక్ట్‌లోకి వెల్ కం చెబుతూ ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని 2025 ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలని తెలియజేస్తామని మేకర్స్ వెల్లడించారు.






