తమిళ దర్శకుల తొలి ఛాయిస్‌గా..
కొంతమంది కథానాయికలు ఒక్క ఛాన్స్ కోసం పరితపిస్తూ ఉంటారు. ఛాన్స్ వస్తే హిట్ కోసం నానా తంటాలు పడుతుంటారు. కొందరు ముద్దుగుమ్మలకు హిట్ ఫట్‌లతో సంబంధం ఉండదు. అవకాశాలు అలా వెదుక్కుంటూ వచ్చేస్తుంటాయి. అది కొందరికే సాధ్యం. ఇలాంటి వారికి కథానాయిక మమితా బైజు ఒకరు. ఈ మలయా ళం ముద్దుగుమ్మ నటించిన ప్రేమలు చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం మమితా బైజుకి పెద్ద బ్రేక్ ఇచ్చింది.
ఇక వరుసబెట్టి సినిమా అవకాశాలు భాషా భేదం లేకుండా అమ్మడిని వెదుక్కుంటూ వస్తున్నాయి. అలా మమితా ‘రెబల్’ అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఏంటి? అమ్మడికి ఛాన్సులు అలవోకగా వస్తున్నాయి. విజయ్ చివరి చిత్రంలోనూ అవకాశం కొట్టేసింది. తాజాగా మరో చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నారట. నటుడు ప్రదీప్ రంగనాథ్ సరసన కూడా ఛాన్స్ అందుకున్నారని సమాచా రం. మొత్తానికి అమ్మడు తమిళ దర్శకుల తొలి ఛాయిస్ అవుతున్నారు.






