16 May, 2026 | 4:14 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీకి అంతం లేదు

24-03-2025 12:02 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

వనపర్తి టౌన్, మార్చి 23 ( విజయక్రాంతి) : కొందరు కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయిందని అంటున్నారని, ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీకి అంతం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.  ఆదివారం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన సిపిఐ శతజయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.

అధికారం కోసం రోజుకోపార్టీ మారే వారు ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారని అలాంటి వారికీ కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో అధికారం లేకపోయినా సిపిఐ వందేళ్లుగా సజీవంగా ఉందన్న విషయం వారు తెలుసుకోవాలన్నారు.    కాంగ్రెస్ బీఆర్‌ఎస్ తదితర పార్టీలు కమ్యూనిస్టు పార్టీని వాడుకొని మోసం చేశారని విమర్శించారు.

మోసపోవటం కమ్యూనిస్టు పార్టీల వంతైందన్నారు. పెద్ద దొంగ కంటే చిన్న దొంగ మేలు అన్నట్టు బిజెపి, బీఆర్‌ఎస్ లు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకుందని విమర్శించారు.

ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్ పై విమర్శల దాడి చేయటం సిగ్గుచేటు అన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, అబ్రహం, మోష, రాబర్ట్, గోపాలకృష్ణ, శ్రీహరి,ఎత్తం మహేష్, రవీందర్, కృష్ణవేణి, గీత, కుతుబ్, నరసింహ శెట్టి, లక్ష్మీనారాయణ, డంగు కుర్మయ్య, యూసఫ్, కాకం బాలస్వామి, నరేష్, వంశి, భూమిక, శిరీష, సహదేవుడు, కురుమయ్య పాల్గొన్నారు.