22 May, 2026 | 11:44 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

కన్నప్పలో ప్రళయ కాల రుద్రుడిగా..

04-02-2025 12:00 AM

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ రూపొందుతు న్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం ‘కన్నప్ప’ చిత్రంలోని పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ వస్తున్నారు.

తాజాగా సోమవారం కన్నప్ప నుంచి ప్రభాస్ పాత్రను రివీల్ చేశారు. రుద్రుడిగా ఈ చిత్రం లో ప్రభాస్ అద్భుతంగా కనిపించబోతున్నాడు. ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోషిస్తున్న పవర్ ఫుల్ పాత్రను పరిచయం చేశారు. ప్రభాస్ వేషధారణ, లుక్ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడేలా కనిపిస్తోంది. కన్నప్ప చిత్రంలో మోహన్‌లాల్, శరత్‌కుమార్, మోహన్‌బాబు, బ్రహ్మానందం వంటి అగ్ర తారాగణం భాగమైంది.