11న టీసీఎస్ మెగా క్యాంపస్ డ్రైవ్
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11 మెగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం తెలిపారు. ఈ మెగా క్యాంపస్ డ్రైవ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్ పట్టణంలోని నలంద డిగ్రీ కాలేజ్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
2024, 2025, 2026 సంవత్సరాల్లో B.A, B.Com, B.Sc డిగ్రీ పూర్తి చేసిన లేదా ఈ ఏడాది పూర్తి చేయనున్న విద్యార్థులు ఈ డ్రైవ్‌కు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు అధికారిక ప్రకటనలో పొందుపరిచిన QR కోడ్‌ను స్కాన్ చేసి లేదా https://surl.li/aoenxf లింక్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపస్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9502786438, 9849913061 నంబర్లను లేదా జిల్లా ఉపాధి కల్పనా అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.






