10 August, 2026 | 3:45 PM

మాస్ లైన్ నాయకుల అరెస్టులు అన్యాయం

10-08-2026 02:35 PM

సయ్యద్ హుస్సేన్  మాస్ లైన్ హుజూర్ నగర్ డివిజన్ కార్యదర్శి.

నేరేడుచర్ల,ఆగష్టు,10(విజయ క్రాంతి): అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాస్ లైన్ నాయకులను నేరేడుచర్ల పోలీసులు(Nereducherla Police) అక్రమంగా అరెస్ట్ చేసి  స్టేషన్ లో నిర్బంధించి ఉంచడం అన్యాయమని ఈ అరెస్టులను ప్రతి ఒక్కరు ఖండించాలని సయ్యద్ హుస్సేన్  మాస్ లైన్ హుజూర్ నగర్ డివిజన్ కార్యదర్శి కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని, ప్రభుత్వాలని ప్రశ్నించే వారిని అరెస్టులు చేయడం ఆనవాయితీ గా మారిందన్నారు.మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రజా పాలన ఉంటుందని చెప్పిన రేవంత్ ప్రతి నిత్యం ప్రజల కోసం పని చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. అరెస్ట్ చేసిన మాస్ లైన్ జిల్లా నాయకులు వాస పల్లయ్య  తదితర నాయకులు బేషరతుగా విడుదల చేయాలని కోరారు.