1 August, 2026 | 9:06 PM

గుడిబండలో ఘనంగా ఆషాడ గోరింటాకు సంబరాలు

01-08-2026 08:31 PM

కోదాడ,(విజయక్రాంతి): గుడిబండ గ్రామంలో శనివారం ఆషాడ మాసం సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఓరుగంటి రమాదేవి, పోనగళ్ళ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ రమాదేవి, విజయలక్ష్మిలు మాట్లాడుతూ.. గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది అని ఇది మన సంస్కృతి అని నిర్వాహకులు తెలిపారు.

అలాగే  గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ పాటలు, ఆటలతో వేడుకను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంతి, స్థానికులు తేజశ్రీ, తూమాటి ఝాన్సీ, సిహెచ్ లక్ష్మి, చింత మాధవి, వనజమ్మ, నిర్మల, ఓరుగంటి డిష్, పిచ్చుకల రాధ, సౌజన్య, వెంకట్ రావమ్మ, దుర్గ, మమత, పద్మ, తులసమ్మ, అనుష, బెజవాడ వెంకట రావమ్మ, తదితరులు స్థానిక మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.