1 August, 2026 | 9:41 PM

డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావును సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

01-08-2026 09:05 PM

ముకరంపుర,(విజయక్రాంతి): అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ అందుకున్న కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావును బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్  పొన్నం అనిల్  శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.