గ్రామాభివృద్ధి పనుల పరిశీలన
01-08-2026 08:36 PM
- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు
కోనరావుపేట,(విజయక్రాంతి): గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం పరిశీలించారు. గ్రామంలోని కంపోస్ట్ షెడ్ ఫినిషింగ్ పనులతో పాటు ప్రభుత్వ హైస్కూల్‌లో విండోస్ మరమ్మతు పనులు, ప్రాథమిక పాఠశాల వాష్‌రూమ్ మరమ్మతులు, హైస్కూల్ వాష్‌రూమ్ రిపేర్ పనులను పరిశీలించి, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి కొనసాగుతోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.






