20 July, 2026 | 6:24 PM

భక్తిశ్రద్ధలతో ఆషాఢ బోనాలు

20-07-2026 12:58 AM

అశ్వారావుపేట, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల వేడుకలు. గుర్రాల చెరువు గ్రామంతో పాటు అశ్వారావుపేట లోని వడ్డెర బజార్ లోకూడా ఘనంగా జరిగాయి. ఆషాడంలో అమ్మవారిని పూజిస్తే సుఖసంతోషాలు, వర్షాలు కురిసి పంటలు పండుతాయని భక్తుల నమ్మకం. బి ఆర్ ఎస్ కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, కాసాని పద్మాలు బోనాలు ఎత్తుకున్నారు.

బోనాల అనంతరం గ్రామంలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు, హారతి ఇచ్చి భక్తులు ప్రసాదం అందజేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు,  మహిళా సంఘాల సభ్యులు, పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.