పక్కా భవనాలు నిర్మించారు.. తీసుకోకుండా
- ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ ఆదివాసి గిరిజన గ్రామాల్లో వృధాగా దర్శనమిస్తున్న ఎంపీసీ భవనాలు..
- ఒక్క భవనానికి 60 లక్షలు ఖర్చు..
- నేడే ఉట్నూరులో ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమావేశం
ఉట్నూర్, జూలై 19 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నివాసముంటున్న ఆదివాసి ఆదిమ గిరిజనులను అన్ని రంగాల్లో ముం దుకు తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు పీఎం జన్ మన్ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ పథకము ద్వారా ఆదిమ ఆదివాసి గిరిజనులు నివా సం ఉండే గ్రామాలకు రహదారి సౌకర్యం తో పాటు విద్య,వైద్యం వివిధ రంగాల్లో నైపుణ్యతలో శిక్షణ ఇచ్చి వారికి ప్రభుత్వ ప్రవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
ఆదివాసి ఆదిమ గిరిజన ( పి వి టి జి ) చిన్నారి పిల్లల నుండి నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఇచ్చేందుకు 60 లక్షల రూపాయలతో పక్కా భవనం నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 60 ఎంపీసీ భవనాలను మంజూరు చేశారు. పీఎం జన్ మన యోజన పథకంలో మం జూరు చేసిన ఎంపీసీ భవనాల పనులు కొ నసాగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మం జూరైన 60 భవనాలలో ఇప్పటివరకు 35 భవనాలు పూర్తి ఏడాది పూర్తయిన నేటికీ భవనాల తాళాలు తీర్చుకోవడం లేదు. మిగ తా భవనాల పనులు ఆయాస్థాయిలోనే కొ నసాగుతున్నాయి. ఇప్పటికైనా పూర్తయిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చి అక్కడి నిరుద్యోగ యువతీ యువకులకు ఉ ద్యోగ అవకాశాల కొరకు శిక్షణ కార్యక్రమా లు ఏర్పాటు చేయాలని ఆదిమ గిరిజనులు కోరుతున్నారు.
ఎంపీసీ బోనాలతో ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులతో మం జూరు చేసిన ఎంపీసీ భవనాలు పూర్తి అ యితే ఈ భవనాలలో ఆదివాసి ఆదిమ గిరిజన పిల్లలకు అంగన్వాడీల ద్వారా పౌష్టి కారంతోపాటు ఈ భవనలులే విద్యార్థులకు చదువులు చెప్పడం, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. ఆదిమ గిరిజనుల సమస్యల పరిష్కారానికి వచ్చే అధి కారులు ఈ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం తో పాటు ప్రతివారం వైద్య సిబ్బంది .
ఆ గూడాలకు వెళ్లి ఆదిమ గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి సరియైన మందులు ఇవ్వడంతోపాటు వారికి వైద్య సూచనలు చేసే విధంగా ఈ ఎంపీసీ భవనాల్లో ప్రత్యేక గదులు నిర్మించారు. ఆది మ గిరిజన గ్రామాల్లో నిర్మించిన ఎంపీసీ భవనాలను వినియోగములకు తీసుకొచ్చే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గిరిజన యువతి యువకులు కోరుతున్నారు..
25 ఎంపీసీ భవనాలు ఆయా స్థాయిలో పనులు జరుగుతున్నాయి: తానాజీ జాదవ్, ఈ ఈ గిరిజన ఇంజనీరింగ్ విభాగం ఉట్నూర్
ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో మంజూరైన 60 ఎంపీసీ భవనాల లో 35 భవనాలు పూర్తి అయ్యాయని, మిగ తా 25 భవనాల పనులు ఆయా స్థాయిలో జరుగుతున్నాయని ఈ ఈ తానాజీ జాదవ్ అన్నారు. గుడాల్లో పూర్తయిన ఎంపీసీ భవనాల పర్యవేక్షణను గ్రామపంచాయతీకి అ ప్పగిస్తామని ఆయన తెలిపారు.
ఈ భవనాలలో అంగన్వాడి, పాఠశాల, వైద్యం, నిరు ద్యోగులకు శిక్షణ, అధికారులు హాజరైన స మయంలో సమావేశం నిర్వహించుటకు ప్ర త్యేక గదులను నిర్మించామన్నారు. ఈ భవనాల ఏర్పాటుతో కొలం గిరిజనులకు ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందే విధంగా గ్రామసభలు నిర్వహించుకోవచ్చునని ఆయన తెలిపారు. భవనాలు నిర్మించిన గ్రామ పం చాయతీకి అప్పగించిన తర్వాత అన్ని శాఖల అధికారులు ఈ భవనానికి వెళ్లి ఆదిమ గిరిజనుల సమస్యలను పరిష్కరించవలసి ఉం టుందని ఆయన తెలిపారు.






