11 August, 2026 | 12:21 PM

పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు

11-08-2026 11:43 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): శిథిలావస్థకు చేరిన పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుండగా పైకప్పు పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ గాయపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో మంగళవారం జరిగింది. భవనం శిథిలం కావడంతో కొత్తగా మరో భవనాన్ని నిర్మించినప్పటికీ ఫర్నిచర్ లేకపోవడంతో కొత్త భవనంలోకి మార్చకుండా పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం పైకప్పు పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. అదే తలపై పడి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని విమర్శలు వస్తున్నాయి. వెంటనే అతని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చాలని కోరుతున్నారు.