11 August, 2026 | 12:11 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి

11-08-2026 11:39 AM

గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు  జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్కే ఖదీర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రూ. 71000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఖదీర్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్‌ఓసీల ద్వారా అర్హులైన వారికి అవసరమైన సహాయం అందేలా ఎంమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు కృషి చేస్తున్నారని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకు వస్తే ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేరకు సహాయం అందించేందుకు పాయం  అహర్నిశలు కృషి చేస్తారని ఈ సందర్బంగా పాయంకు  మండల ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య, మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ, భుక్య శ్రీను, గుండాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాంకుడోత్ రమేష్,  ఇస్రార్, గడ్డం రాజేష్, సనప రాంబాబు, పల్లపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.