10 March, 2026 | 7:24 PM

అస్మిత లీగ్ మహిళలకు క్రీడాపోటీలు

09-03-2026 12:45 AM

సికింద్రాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): క్రీడలు,ఆరోగ్యం,శారీరక దృఢత్వంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే విధంగా క్రీడలు ప్రోత్సహిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ జింఖా నా గ్రౌండ్‌లో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మైభారత్ కేంద్రం ఆధ్వర్యంలో అస్మిత లీగ్ కింద మహిళలకు క్రీడాపోటీలు నిర్వహించారు.

ఈ పోటీలలో 13 ఏళ్లలోపు, 13 ఏళ్లు. 18 ఏళ్లు పైబడిన వారు సహా వివిధ వయసుల వర్గాలలో క్రీడాకారుల ప్రతిభ, వారిలోని పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలను అథ్లెటిక్ ఈవెంట్లుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి,  ప్రసార భారతి అసిస్టెంట్ డైరెక్టర్ సీమా కుమారి, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి సౌందర్య,తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సంఘం చైర్పర్సన్ బి.మాధవి,

జాతీయ రోయింగ్ క్రీడాకారిణి గీతాంజలి, జిల్లా యువజన క్రీడా అధికారి నందకిషోర్ గోకుల్ పాల్గొ ని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన మేరా యువ భారత్’ హైదరాబాద్ విభాగం భారత క్రీడా ప్రాధికార సంస్థ, ఖేలో ఇండియా, తెలంగాణ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఖుష్బు గుప్తా విజయవంతంగా నిర్వహించారు.