ఉపాధి పనుల్లో ఎఫ్‌ఆర్‌ఏ నమోదుకు ఆటంకం
మరిపెడ, మార్చి 8 (విజయక్రాంతి): మరిపెడ మండలం తాళ్ల ఉకల్, బావోజి గూడెం, ఎలమంచిలి తండా, నీలుకుర్తి , ఆనేపురం, తండాధర్మారంతో పాటువివిధ గ్రామాల్లో అమలవుతున్న ఉపాధి హామీ పథకంలో కార్మికులు ఫేస్ రికగ్నైజడ్ అటెండెన్స్ సిగ్నల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పనిస్థలాల్లో హాజరు నమో దు చేయడానికి ఉపయోగించే మొబైల్ యాప్లో సిగ్నల్ సరిగా లేకపోవడంతో ఉపాధి హామీ కార్మికుల హాజరు నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి రోజు పని చేసినప్పటికీ, సిగ్నల్ సమస్య కారణంగా ఫోటో లేదా ఐరీష్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో వేతనాలు ఆలస్యం అవుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సౌకర్యం సరిగ్గ లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. కార్మికులు పని చేసినప్పటికీ హాజరు నమో దు కాకపోవడం వల్ల వారికి న్యాయం జరగడం లేదని పలువురు పేర్కొన్నారు. సమస్యను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ విధానం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
ఐస్ స్కాన్ అటెండెన్స్ తీసుకోకపోతే సంబంధిత ఆధార్ సెంటర్ కి వెళ్లి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. సీనియర్ మేట్ అయిన ఫీల్ అసిస్టెంట్ అయినా ఎర్లీ మార్నింగ్ సెల్ఫోన్లో డేటా అంత క్లియర్ చేసిన తర్వాతనే ఎన్ ఆర్ వి జి ఏ మొబైల్ యాప్ లో మస్టర్ ఫ్రెష్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగయితేనే ప్రతి ఒక్కరి అటెండెన్స్ నమోదు అవుతుందని మరిపెడ ఏపీవో బీమ్లా నాయక్ తెలిపారు.




