15 April, 2026 | 2:16 AM

సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి

07-06-2025 12:34 AM

కామారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ పిఎస్ పరిధిలోని అంచనూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన  6 సీసీ కెమెరాలను  ఏ ఎస్ పి  చైతన్య రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో  సిఐ  సంపత్ కుమార్ , దోమకొండ ఎస్‌ఐ స్రవంతి  పాల్గొన్నారు.

ఈ సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయుటకు ముందుకు వచ్చిన మనోహర్ ని సన్మానించారు. గ్రామ యువత ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏర్పాటులో ముందంజగా ఉంటూ పోలీసులకు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటూ , దొంగతనాలు జరుగకుండా  ఉండాలంటే సీసీ కెమెరాల ను ఏర్పాటు చేసుకొవాలని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని  తెలిపారు.  సైబర్ నేరాల పట్ల  అప్రమత్తం గా ఉండాలంటూ   అవగాహన కల్పించారు.