29 August, 2026 | 1:32 AM

డా. శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించిన డిప్యూటీ మేయర్

23-06-2026 12:52 PM

ముకరంపుర, జూన్ 23(విజయక్రాంతి): ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే సమున్నత లక్ష్యంతో కాశ్మీర్ సమగ్రత కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు,  డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ  బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తన క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి పూలమాలవేసి, ఆయన చేసిన సేవలను మరియు త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి సునీల్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆంజనేయులు, అనిల్, బాలు, మహేందర్, తిరుపతి, మల్లయ్య, రాజయ్య, రోహిత్, సాయి ,తదితరులు పాల్గొన్నారు.