29 August, 2026 | 3:53 AM

పెద్దమ్మతల్లి బోనాల ఉత్సవాలకు పూర్తి వసతులు

23-06-2026 12:56 PM

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హామీ

ముకరంపుర, జూన్ 23(విజయ క్రాంతి): హస్నాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో  పెద్దమ్మతల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. జూలై 5,  సాయంత్రం 6:00 గంటలకు ఈ జాతర ప్రారంభం కానుందని ఆలయ కమిటీ తెలిపింది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ను ఆలయ కమిటీ అధ్యక్షులు కుంభం మల్లయ్య నేతృత్వంలోని బృందం ఆహ్వానించారు. 

మౌలిక సదుపాయాలు కల్పించి సహకరించాలని నగరపాలక సంస్థను వారు ఒక వినతిపత్రం ద్వారా కోరారు.ఈ విజ్ఞప్తిపై యాదగిరి సునీల్ రావు  సానుకూలంగా స్పందించారు. బోనాల పండుగను ఘనంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ పక్షాన పూర్తి సహకారం ఉంటుందని  స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మతల్లి దేవాలయం అధ్యక్షులు కుంభం మల్లయ్య,ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి,ఉపాధ్యక్షులు జడిగాల రాజయ్య,కోశాధికారి గంది.శ్రీనివాస్, మరియు కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు..