రక్తదానంతో యువతి ప్రాణం కాపాడిన యువకుడు
కరీంనగర్,క్రైమ్: రక్తదానంతో యువతి ప్రాణం కాపాడిన లక్షెట్టిపేట్ యువకుడు సామాజిక సేవకుడు గాలిపెల్లి కుమార్ చొరవకు పలువురి ప్రశంసలు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించి, అత్యంత అరుదైన రక్త గ్రూపును అందించి ఒక యువతి ప్రాణాన్ని కాపాడారు లక్సెట్టిపేట మండలానికి చెందిన ప్రశాంత్. ప్రముఖ సామాజిక సేవకుడు గాలిపెల్లి కుమార్ ప్రత్యేక చొరవతో జరిగిన ఈ ఘటన స్థానికంగా పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
కోమా స్టేజీలో యువతి.. రెండు రోజులుగా అన్వేషణ వివరాల్లోకి వెళ్తే.. కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన గుండ భవాని (20) అనే యువతి ఇటీవల తీవ్ర రక్తస్రావం (అధిక బ్లీడింగ్) కారణంగా కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. శరీరంలో రక్తం శాతం 2 శాతానికి పడిపోవడంతో ఆమె దాదాపు కోమా స్టేజికి చేరుకున్నారు. ఆమెకు అత్యవసరంగా అత్యంత అరుదైన 'బీ నెగెటివ్' రక్తం అవసరమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు రెండు రోజుల పాటు ఎంత వెతికినా ఈ గ్రూప్ రక్తం లభించక తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
గాలిపెల్లి కుమార్ చొరవ.. రంగంలోకి రక్తదాత
బాధితుల పరిస్థితిని అల్లు అర్జున్ స్టేట్ ప్రెసిడెంట్ అంజి యాదవ్ సౌజన్యంతో ప్రముఖ సామాజిక సేవకుడు, ఔట్‌స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కుమార్, తన నెట్‌వర్క్ ద్వారా అన్వేషించగా.. లక్సెట్టిపేట మండలానికి చెందిన ప్రశాంత్ 'బీ నెగెటివ్' రక్తదానానికి ముందుకు వచ్చారు. సమాచారం అందిన వెంటనే ప్రశాంత్ లక్సెట్టిపేట నుండి కరీంనగర్ ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఎట్టకేలకు రక్తం దొరకడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.






