28 May, 2026 | 1:32 AM

ఉమ్మడి పౌరస్మృతికి ‘అసోం’ ఆమోదం

28-05-2026 12:58 AM

భువనేశ్వర్, మే 27: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లుకు అసోం అసెంబ్లీ బుధవా రం ఆమోదం తెలిపింది. దీంతో ఉత్తరాఖం డ్, గుజరాత్ తరువాత యూసీసీకి ఆమో దం తెలిపిన మూడోరాష్ట్రంగా అసోం అవతరించింది. అమలుకు ముందు అసెంబ్లీలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ.. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు.

ఏకరీతి పౌర స్మృతి బిల్లు రోజంతా చర్చ జరిగిన అనంతరం, దానిని ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టాలని అసెంబ్లీ స్పీకర్ రంజిత్ కుమార్ దాస్ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కోరారు. దీంతో రోజంతా చర్చ అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు. ప్రతిపక్షాలు బిల్లును ముందుగా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తూ, సభలోని వెల్‌లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు.