టీఎంసీ మమతపై ఎఫ్‌ఐఆర్
గతంలో సనాతనం, హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యల కేసుపై
కోల్‌కతా, మే 27: సనాతన, హిం దూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. న్యాయవాది రింకీ చటర్జీసింగ్ బుధవారం ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీపై సిలిగురి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 351 (1), సెక్షన్ 352, 353 (2)ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నా రు. 2025లో కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె సనాతన ధర్మం, హిందూ మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమై అప్పట్లోనే పెద్ద వివాదంగా మారిందనది. ఆ విషయంపై ఇప్పటి వరకు మమతా బెనర్జీ స్పందించలేదన్నారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 2025లో ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు గతంలోనే ప్రయత్నించగా, తనను పట్టించుకోకుండా వేధించారని అన్నారు. కాగా కేసు దర్యాప్తు అనంతరం పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు.






