Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ
గౌహతి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Assam Election Results 2026) వెలువడుతున్నాయి. అస్సాం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో దూసుకుపోతుంది. సోమవారం ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, అస్సాంలోని ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా, అఖిల్ గొగోయ్, లూరింజ్యోతి గొగోయ్, జగదీష్ భుయాన్, రాజేన్ గోహైన్‌లతో సహా ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ తమ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.
శివసాగర్ జిల్లాలోని నజీరా స్థానంలో కాంగ్రెస్ నాయకుడు సైకియా 4,967 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి, సైకియాకు 6,640 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి మయూర్ బోర్గొహైన్ 11,607 ఓట్లు సాధించారు. సిబ్‌సాగర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పోటీపడుతున్న రైజోర్ దళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ మొదటి రౌండ్ తర్వాత వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కుశాల్ దోవారీకి 5,171 ఓట్లు లభించగా, అఖిల్ గొగోయ్‌కు 3,262 ఓట్లు పోలయ్యాయి. అస్సాంలో BJP 79, INC 24, BOPF 10, AGP 10, AIUDF 2 , RJRD 1 స్థానాల్లో ఉన్నాయి.






