16 August, 2026 | 5:55 PM

రవికుమార్ దశదినకర్మకు హాజరైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

16-08-2026 05:11 PM

ఆలేరు, ఆగస్టు 16 (విజయక్రాంతి): తుర్కపల్లిలో ఇటీవల మృతిచెందిన రిపోర్టర్ దుగ్యాల రవికుమార్ దశదినకర్మకు తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై రవికుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవికుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.