16 August, 2026 | 5:55 PM

ఘనంగా అనంత లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం

16-08-2026 05:13 PM

బోధన్, ఆగస్టు 16(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని బురుడుగల్లీలో గల శ్రీశ్రీశ్రీ అనంత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు,హోమం,యాగం, గోపూజ తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గమరపేట శంకర్,చక్రి,లింగం,వెంకట్, ప్రవీణ్,ప్రసాద్,భాస్కర్, అక్షయ్,ప్రశాంత్,వినోద్, విగ్నేష్,నితిన్,యశ్వంత్, ప్రణయ్,శివకుమార్,కార్తీక్, సిద్దు,శివ చరణ్,అజయ్ నందు,కిట్టు,వినోద్ తదితరులు పాల్గొన్నారు.