16 August, 2026 | 7:13 PM

ఉప్పల్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలు

16-08-2026 05:07 PM

ఉప్పల్ ఆగష్టు 16(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో  బిఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్  రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఎంతో భక్తి భావంతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.