16 August, 2026 | 6:03 PM

ప్రతి పేద కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డు

16-08-2026 05:20 PM

బోథ్, ఆగస్టు 16 (విజయక్రాంతి): అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిజిటల్ కార్డులను అందజేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్, పోశెట్టి పేర్కొన్నారు. ఆదివారం సున్నాల మండల కేంద్రంలోని రేషన్ షాప్ లో అర్హులైన పేదలకు డిజిటల్ కార్డులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బీమ్ రావు పాటిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మునేశ్వర సోమన్న, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అమృత రావు ,పార్టీ సీనియర్ నాయకులు బాసెట్టి సుదర్శన్, చంద్రకాంత్ ,ఖలీల్ తో పాటు రేషన్ షాప్ డీలర్ పి గంగాధర్ ను ఉన్నారు.