17 June, 2026 | 1:07 AM

సీతారామ ప్రాజెక్టుతో అశ్వాపురం రైతులకు సాగునీటి భరోసా..

17-06-2026 12:00 AM

మారెళ్ళపాడు లిఫ్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అశ్వాపురం, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువమా రెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, సాంకేతిక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన రైతులకు సాగునీరు త్వరితగతిన అందేలా పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

సీతారామ ప్రాజెక్టు పినపాక నియోజకవర్గ వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలుస్తుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే అశ్వాపురం మండలంలోని సండ్రలబోడు, అమెర్ద గ్రామపంచాయతీల పరిధిలోని చెరువులు, కుంటలకు సీతారామ ప్రాజెక్టు నీటిని అం దించే విస్తరణ పనుల ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభించి ఆయా గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఎమ్మార్వో, మండల పరిషత్ అధికారులు, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.