17 June, 2026 | 1:02 AM

బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తా..

17-06-2026 12:00 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు

అంబర్‌పేటలో ఘనంగా వీహెచ్ జన్మదిన వేడుకలు

పేదలకు అన్నదానం, పలు సేవా కార్యక్రమాలు

అంబర్ పేట, జూన్ 16 (విజయక్రాంతి): సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంత రావు జన్మదిన వేడుకలు మంగళవారం బాగ్ అంబర్‌పేట్‌లోని ఆయన నివాసంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమాను లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ నాయకులు, అభిమానుల సమ క్షంలో వి. హనుమంత రావు భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు మోతే రోహిత్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పుల్ల నారాయణ స్వామి, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపు నూరి కృష్ణ గౌడ్, అవినాష్, దిలీప్ కుమార్ నేత, గడ్డం లక్ష్మణ్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్, శ్రీకాంత్ నేత తదితరులు పాల్గొని పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. వీహెచ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు అన్నదానంతోపా టు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వి.హనుమంత రావు  మాట్లాడుతూ తనపై ఎల్లప్పుడూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానన్నారు.