25 August, 2026 | 11:51 PM

ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిన హామీలను తక్షణమే అమలు చేయాలి

25-08-2026 11:09 PM

ద్యోగ భద్రత, పెంచిన పని భారం తగ్గించాలి

టి ఎస్ ఆర్టిసి స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు హెచ్ బసవయ్య డిమాండ్ 

ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన సి ఐటియు,రైతు సంఘం నాయకులు

సత్తుపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యంతో అంగీకరించిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు హెచ్ బసవయ్య డిమాండ్ చేశారు.సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట డిపో కమిటీ సెక్రెటరీ దొరబాబు అధ్యక్షతన నిర్వహించిన  నిరాహార దీక్షలో సభ పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు అలివేన్స్ 80% పెంచి అమలు చేయాలని 2021 ప్లేస్కేల్ అరియర్స్ స్పష్టతనిచ్చి అమల పరచాలని కోరారు. అర్హత కలిగిన  కార్మికులకు జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రెగ్యులరేషన్ చేపట్టాలని పేర్కొన్నారు.

ఆర్టీసీలో పెంచిన పని భారం తగ్గించాలని రిటైర్డ్ ఐన కార్మికులకు తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటి యు,జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, సిఐటియునాయకులు మోరంపూడి పాండురంగారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, ఆర్టీసీ ఉద్యోగుల నిరసన దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ,ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలలో న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీ ఈడీ కమిటీతో అంగీకరించిన అంశాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నిరసన దీక్ష నిరసన దీక్షితులకు సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు మల్లూరు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు, మహిళా సంఘం డివిజన్ అధ్యక్షులు చెరుకు రత్నకుమారి, పుష్పవల్లి పాల్గొని సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో డిపో సెక్రటరీ దొరబాబు, రీజన్ సహ కార్యదర్శి కృష్ణారెడ్డి, డిపో కమిటీ అధ్యక్షులు ఎస్ వి రావు, ఎన్ జాకబ్, జగన్నాథం, కృష్ణవేణి, మంజురాణి, ధనలక్ష్మి, పలువురు ఆర్టీసీ కార్మికులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,..