ఎరువుల బుకింగ్‌లో పారదర్శకతకు కొత్త విధానం
రైతులకు ఎరువుల విక్రయ యాప్ పై అవగాహన
నర్సాపూర్: ఎరువుల బుకింగ్, నిల్వలు, పంపిణీలో పారదర్శకత కోసం నూతన విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకురాలు సంధ్యారాణి సూచించారు. నర్సాపూర్ మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన కల్పించారు. రైతులకు ఎరువుల బుకింగ్, నిల్వల వివరాలు, రైతుల వివరాల నమోదు, ముఖ గుర్తింపు ప్రక్రియపై మండల వ్యవసాయ అధికారిణి దీపిక అవగాహన కల్పించారు.
అందు బాటులో ఉన్న నిల్వల ఆధారంగా ఎరువులను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థవంతమైన నిల్వల నిర్వహణ సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మోహన్, దుర్గాప్రసాద్, తేజస్విని, రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.






