పేద ఆర్యవైశ్య కుటుంబానికి ఆర్థిక సహాయం
సూర్యాపేట,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లా కేంద్రానికి చెందిన కొండూరు రవి పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం మంగళవారం సూర్యాపేట ఆర్యవైశ్య మిత్రుల ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ పేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రతి ఆర్యవైశ్యుడు సహకరించాలని కోరారు. ప్రతిభ గల విద్యార్థుల చదువులకు పేదరికం అడ్డుకావద్దని అన్నారు.
భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కొండూరు రవి మాట్లాడుతూ తన అనారోగ్య పరిస్థితులను తెలుసుకొని తన పిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుగంటి వెంకటేశ్వర్లు, తప్సీ గాంధీ, చల్లా సత్యనారాయణ, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, ఉప్పలంచు కృష్ణ, బచ్చు పురుషోత్తం, కొండా శ్రీనివాసరావు, చిత్తలూరి శ్రీధర్ రావు, కూన అర్జున్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.






