calender_icon.png 12 November, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల మధుసూదన్

12-11-2025 12:00:00 AM

ములుగు, నవంబర్ 11 (విజయక్రాంతి) : స్వాతంత్య్రం రాకముందు నిజాం పరిపాలనలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించిన స్టేట్ టీచర్స్ యూనియన్ యొక్క ఆశయాలను నూటికి నూరుపాళ్ళు అమలు చేస్తున్న ములుగు జిల్లా వాస్తవ్యులు ఏళ్ల మధుసూదన్  రాష్ట్ర సంఘ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జీ.సదానంద గౌడ్, జుట్టు గజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు, ములుగు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శిరుప సతీష్ కుమార్, మంచర్లటవి వీరభద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాజనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు.