calender_icon.png 12 November, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ వందేళ్ల పండుగను జయప్రదం చేయాలి

12-11-2025 12:00:00 AM

మహబూబాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండుగను ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. సీపీఐ, ఏఐటీయూసీ ఉమ్మడి పట్టణ సమావేశం స్థానిక వీరభవన్‌లో తోట రాజకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా విజయసారథి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పండుగను ఖమ్మంలో డిసెంబర్ 26న 5 లక్షల మందితో నిర్వహించనున్నట్లు చెప్పారు.

శతాబ్ది బహిరంగ సభ జయప్రదానికై సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నవంబర్ 20న మహబూబాబాద్ జిల్లాకు బస్సుజాత వస్తుందని, ఆరోజు జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బి.అజయ్ సారధి రెడ్డి, పెరుగు కుమార్, దేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వీరవెల్లి రవి, తోట రాజకుమారి, కేదాసు రమేష్, అజ్మీర వేణు, వంకాయలపాటి చిరంజీవి, సీపీఐ, ఏఐటీయూసీ నేతలు కార్మికులు పాల్గొన్నారు.