15 April, 2026 | 7:59 AM

లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

23-02-2026 12:27 PM

లక్షెట్టిపేట టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(Mancherial MLA Prem Sagar Rao) సందర్శించారు. ఆసుపత్రికి వచ్చిన అవుట్ పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాలు, మందులు సమృద్ధిగా అందుతున్నాయా అని విచారించారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, సిబ్బంది కొరత, పరికరాల అవసరం వంటి అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందిస్తామని తెలిపారు.