calender_icon.png 12 November, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుస్థిరమైన రవాణా వ్యవస్థకు బృహత్ ప్రణాళిక

12-11-2025 12:00:00 AM

-‘సమగ్ర మొబిలిటీ ప్లాన్ 2050’ రూపకల్పనకి హెచ్‌ఎండీఏ శ్రీకారం 

-హెఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్  

-ముసాయిదా నివేదికపై భాగస్వామ్య విభాగాలతో సమీక్ష

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగర ప్రాంతం భవిష్యత్ రవా ణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘సమగ్ర మొబిలిటీ ప్రణాళిక 2050 రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. 2050 నాటికి నగరం ఎదుర్కొనే రవాణా సవాళ్లను అధిగమించేందుకు, సుస్థిరమైన రవాణా వ్యవస్థను అందించడమే లక్ష్యంగా ఈ బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం రసూల్‌పురాలోని హెచ్‌ఎంఆర్‌ఎల్ కార్యాలయంలో కీలక భాగస్వామ్య విభాగాలతో హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. 

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబా ద్ మహానగర భవిష్యత్ అభివృద్ధికి 2050 అత్యంత కీలకమని, దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అత్యవసరమన్నారు. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసిన ముసాయిదా నివేదికపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ముసాయిదా నివేదికను అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని  సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు.

నివేదికపై ఆయా శాఖల అభిప్రాయాలు, సూచనలు, సిఫారసులను తక్ష ణం సమర్పించాలి. తద్వారా నివేదికను సవరించి, పటిష్టమైన ప్రణాళికకు తుదిరూపం ఇవ్వగలుగుతాం, అని ఆయన స్పష్టం చేశా రు. సమావేశంలో హెఎంఆర్‌ఎల్, జీహెఎం సీ, టీజీఎస్‌ఆర్టీసీ, హె-యుఎంటీఏ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ విభాగాలతో పాటు టీఎస్‌ఐఐసీ, డీటీసీపీ, హెఆర్‌డీసీఎల్, హెజీసీఎల్, ఎఫ్‌సీడీఏ హెఎండీఏకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.