జీవితంలో సొంతిల్లు రెట్టింపు ఆనందం ఇస్తుంది
13-04-2026 12:18 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర ఏప్రిల్ 12: జీవితంలో సొంతిల్లు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని హాజిలాపూర్,అడవి అజిలాపురం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని స్పష్టం చేశారు. అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.




