13 April, 2026 | 1:25 AM

బీచుపల్లి క్షేత్ర ఆలయాలను దర్శించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

13-04-2026 12:14 AM

అలంపూర్, ఏప్రిల్ 12: కృష్ణానది తీరాన వెలసిన ప్రముఖ దేవస్థానం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాలను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యులు సంపత్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం స్పీ కర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను అలంపూర్ మార్కెట్ వ్యవసాయ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, రుక్మానందరెడ్డి ,పల్లె రాజు, బీస న్న, రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.