అటల్ విచార్ మంచ్!.. యశ్వంత్ సిన్హా.. కొత్త పార్టీ !
హజారీబాగ్: కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఈ ఏడాది చివర్లో కొత్త పార్టీ స్థాపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు అటల్ సేవా కేంద్రంలో తన మద్దతుదారులతో ఆయన సమావేశమయ్యారు. నూతన పార్టీ పేరును అటల్ విచార్ మంచ్ ఏవీఎమ్ గా ప్రకటించారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయూ సిద్ధాంతాలకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఝార్ఖండ్ రాజకీయాలలో ఒక ప్రత్యమ్న్యాయ రాజకీయ శక్తిగా ఏవీెమ్ అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జయంత్ సిన్హా 2014 లో హజారీబాగ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలలో జయంత్ సిన్హా బదులు మనీశ్ జైశ్వాల్ ను భాజాపా అభ్యర్థిగా బరిలోకి దింపగా ఆయన భారీ మెజారిటీ తో గెలుపొందారు.






