యాదాద్రి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
27-08-2024 01:11 PM
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. గవర్నర్ యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయనకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంత్ కే జండగే, ఆలయ మర్యాదలతో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.






