డిజిటల్ సర్వేతో భూ వివాదాలకు తెర
రెవెన్యూ భూముల డిజిటల్ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్
మానకొండూరు, ఆగస్టు 24 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో భూముల సమగ్ర డిజిటల్ సర్వే కింద ఎంపికైన ఐదు గ్రామాల్లో సోమవారం తొలుత వన్నారం గ్రామ శివారు రెవిన్యూ భూముల సరిహద్దు డిజిటల్ సర్వేను మానకొండూర్ మండల తహసీల్దార్ విజయ్ కుమార్ ప్రారంభించారు. వన్నారం.. గంగిపల్లి గ్రామాల మధ్య ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో అర్చకుల చేపూజలు చేసి ప్రక్క ప్రక్కనే సరిహద్దు గల ఇరు గ్రామాల ప్రజల సమక్షంలో డిజిటల్ పరికరాలతో సరిహద్దు పాయింట్ ను గుర్తించి సర్వేకు అంకురార్పన చేశారు. ఈ సమగ్ర సర్వే ద్వారా సరి హద్దు భూముల పరిష్కారంతో ప్రజలకు ఏళ్ల తరబడి ఉన్న భూ వివాదాలకు తెరపడుతుందని, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగ స్వామ్యం కావాలని ఆయన కోరారు.
ఈ డిజిటల్ సర్వే ప్రారంభ కార్యక్రమంలో మండల సర్వేయర్ జీవన్ రెడ్డి, వన్నారం సర్పంచ్ తాళ్ళపల్లి సంపత్, ఉప సర్పంచ్ బాకారపు రాములు, రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు వన్నారం, గంగిపల్లి గ్రామాల జీపీఓ అధికారులు నర్సయ్య, వేణులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలిగంటి ఓదెలు, సింగిల్ విండో డైరెక్టర్ తాళ్లపల్లి కొమురయ్య,మాజీ సర్పంచ్ బాకారావు శ్రీనివాస్, మాజీ మాజీ ఉపసర్పంచ్ బాకారపు తిరుపతి, మాజీ ఎంపీటీసీలు గంగుల రవి, బండ సంపత్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షుడు బనుక తిరుపతి, అంబేద్కర్ సంఘం కన్వీనర్ తాళ్ళపల్లి తిరుపతి నాయకులు పోలాడి యాదగిరి రావు,బాకారపు రమేష్,జగన్ మోహన్ రావు, సంబరవి,నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






