7 May, 2026 | 1:28 AM

ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తం

07-05-2026 12:00 AM

రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. అడుగడుగునా ఏటీఎంలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ మాత్రం అంతంతమాత్రమేనని చెప్పాలి. బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తే ఏటీఎంలలో నగదు ఉండటం లేదు. కొద్దిమంది ఇప్పటికీ నగదు రహిత లావాదేవీల పట్ల ఆసక్తి చూపరు.

అలాంటివారు నగదు రూపంలో లావాదేవీలకే మొగ్గుచూపుతారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అవసరమైనచోట కొత్తగా ఏటీఎంలను ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రతి ఏటీఎంలో అన్ని వేళలా నగదు ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలి. అవసరం ఉన్న ప్రాంతాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని సక్రమంగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్