calender_icon.png 16 October, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

15-10-2025 10:15:27 PM

ఆరుగురుపై కేసు నమోదు..

హనుమకొండ/శాయంపేట (విజయక్రాంతి): మండలంలోని నేరేడుపల్లి గ్రామం పరిధిలో మంగళవారం చందా సుధాకర్ పై పాత కక్షలతో అదే గ్రామానికి చెందిన పలువురు దాడి చేయడంతో తీవ్రంగా గాయాల పాలయ్యారు. దీంతో చందా సుధాకర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన చందా ప్రశాంత్, అతని కుటుంబ సభ్యులు చందా విజయ, ఆకుతోట జ్యోతి, ఆకుతోట పూర్ణ చందర్, చింతపట్ల రాజు, చింతపట్ల కిట్టులపై కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో బుధవారం ప్రగతి సింగారం గ్రామం వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీస్ వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు శాయంపేట ఎస్ఐ పరమేష్ తెలిపారు.