calender_icon.png 16 October, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

15-10-2025 10:18:10 PM

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): దేశ జనాభాలో 50 శాతం ఉన్న కార్మికులతో ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయిస్తున్నాయని సీటు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి అన్నారు. ఏలూరి భవన్ లో జరిగిన సిఐటీయు మండల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నాయని కార్మికుల రక్షణ వేతనం తదితర అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కమిటీలు జనాభాలో సగం కన్నా ఎక్కువగా ఉన్నారని వారీ భద్రత పట్టించుకోకుండా కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వాలు ఊడిగం చేయిస్తున్నారని వాపోయారు. కార్మిక చట్టాలతోనే 4 లేబర్ కోడ్లు తెచ్చారని దానివల్ల కార్మికుల భద్రత రక్షణ హక్కులు లేవని అన్నారు. షేక్ ఫాతిమా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, సుల్తానా, మరియా, చీమల రమణ, సత్యనారాయణ కోరి, కటకం రాజయ్య, ఈసం రాధ తదితరులు పాల్గొన్నారు.