30 August, 2026 | 11:17 AM

Breaking News

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్   •   కడియాల కుంట సర్పంచ్ పై ఆశ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫిర్యాదు   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   NEET PG 2026: దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2026 పరీక్ష   •   10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •  

కుటుంబ తగాదాలతో అత్తపై దాడి

29-06-2025 02:32 AM

చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

వేములపల్లి, జూన్ 28: కుటుంబ కలహాలతో కోడలు కర్రతో దాడి చేయడంతో అత్త మృతి చెందింది. వేములపల్లి మండలం సల్కునూరులో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం గుర్రం అంజమ్మ (72)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు నాగయ్య భార్య పార్వతమ్మతో మూడు రోజుల క్రితం ఇంటి సమస్య విషయమై గొడవ జరిగింది.

దీంతో పార్వతమ్మ అత్త అంజమ్మ తలపై కర్రతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కి తరలించగా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ హాస్పిటల్‌కి తరలించగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం అంజమ్మ మృతి చెందింది.