ముసుగులేసుకుని కొట్టిండ్లు

16-09-2026 | 05:10am
  • కేటీఆర్ పీఆర్‌ఓ, పీఏలపై దాడి
  • పీఎస్‌లోనే దాడి చేయడం అమానుషం
  • మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పీఆర్‌ఓ, పీఏ(PRO, PA)పై పోలీస్ స్టేషన్(Police station) సాక్షిగా ముసుగులు ధరించిన కొందరు దాడి చేయించడాన్ని ఖండిస్తున్నామని మాజీమంత్రి హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. పండగ రోజున విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు రప్పించి, సాయంత్రం 6:30 గంటల సమయంలో సుమారు 15 మంది ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించారని ఆరోపించారు. ఇంటరాగేషన్ రూమ్‌(Interrogation room)లోకి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారని, అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ లీగల్ టీం(BRS Legal Team) గమనించి కేకలు వేయడంతో ముసుగులు ధరించిన వారు పారిపోయారని తెలిపారు.

ప్రభుత్వమే ముసుగులు ధరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసుల(Task Force Police)తో దాడికి యత్నించడం అత్యంత దుర్మార్గమన్నారు. పోలీస్ కస్టడీ(Police custody)లో ఉన్న వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే దాడులు చేస్తారా? అని నిలదీశారు.

ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని సైతం లెక్కచేయకుండా ఈ దాడి యత్నం కోర్టును ధిక్కరించడమే అన్నారు. హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈ ఘటనపై స్పందించాలన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ముసుగులు ధరించిన పోలీసులను గుర్తించి.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు.  

మరిన్ని వార్తలు